సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 23 డిశెంబరు 2017 (17:05 IST)

సల్మాన్ - శిల్పాశెట్టిలపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు

బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, శిల్పాషెట్టిలపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ముంబైకి చెందిన రోజ్‌గార్ ఆఘారీ రిపబ్లిక్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుతో వీరిద్దరిపై అంధేరీ పోలీసులు ఈ కేసు కింద నమోదు చేశ

బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, శిల్పాషెట్టిలపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ముంబైకి చెందిన రోజ్‌గార్ ఆఘారీ రిపబ్లిక్ పార్టీ  ఇచ్చిన ఫిర్యాదుతో వీరిద్దరిపై అంధేరీ పోలీసులు ఈ కేసు కింద నమోదు చేశారు. వీరిద్దరూ ఓ కార్యక్రమంలో పాల్గొని వాల్మీకీలను అవమానించారంటూ ఫిర్యాదుచేశారు. 
 
సల్మాన్ కొత్త చిత్రం "టైగర్ జిందాహై". ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా, సల్మాన్ ఓ టీవీ షోలో మాట్లాడుతూ, 'నా డ్యాన్స్ ఏమైనా భాంగీలా ఉందా' అంటూ ప్రత్యేకంగా ఓ కులాన్ని గురించి మాట్లాడారు. అదేసమయంలో శిల్పా కూడా 'నైమైనా భాంగీలా కనపడుతున్నానా' అని అడిగారు. 
 
దీనిపై వాల్మీకీలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. సల్మాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన టైగర్ జిందాహై సినిమా థియేటర్ల ముందు ఆందోళనలు నిర్వహించారు. వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అంతపెద్ద స్టార్లే అలా ఓ కులాన్ని గురించి మాట్లాడితే.. వారిని ఫాలో అయ్యేవాళ్లకు వాళ్లు ఏం మెసేజ్ ఇస్తున్నట్టని ప్రశ్నించారు.