1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 23 ఫిబ్రవరి 2019 (11:18 IST)

కలర్స్‌పై జరిమానా.. రంభ, రాశి ఇలాంటి పనులు చేయొద్దు.. ఫోరమ్ వార్నింగ్

ప్రకటనల పట్ల సినీ తారలు అప్రమతతంగా వుండాలని వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి మాధవరావు హెచ్చరించారు. ఊబకాయం తగ్గిస్తామని, మీరు కూడా సినీ తారల్లా సన్నజాజి తీగల్లా నాజూగ్గా మారిపోవచ్చని వస్తున్న ప్రకటనల పట్ల మోసపోయే వారు చాలామంది వున్నారని.. ఇలాంటి ప్రకటనల్లో కనిపించేందుకు ముందు బాగా ఆలోచించుకోవాలని వినియోగదారుల ఫోరం స్పష్టం చేసింది.


ఇందులో భాగంగా వెయిట్ లాస్‌పై రాశి, రంభలతో రూపొందించిన యాడ్స్‌ను తక్షణమే నిలిపివేయాలంటూ వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి విజయవాడలో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించడంతో వెయిట్ లాస్ సైడ్ అఫెక్ట్స్ వెలుగులోకి వచ్చాయి. కలర్స్ అనే వెయిట్ లాస్ సంస్థ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు రాశి, రంభలతో ప్రత్యేకంగా యాడ్ రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ ప్రకటన చూసి తాను ట్రీట్ మెంట్ తీసుకుని మోసపోయానని బాధితుడు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. 
 
ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన వినియోగదారుల ఫోరం.. బాధితుడి ట్రీట్మెంట్ కోసం చెల్లించిన రూ.74,652 మొత్తానికి 9 శాతం వడ్డీ కలిపి వెంటనే చెల్లించాలంటూ ఆదేశించారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల్లో నటించడం మానుకోవాలని సూచించారు. ఇకపై ఇలాంటి ప్రకటనల్లో కనిపిస్తే సెలెబ్రిటీలకు కూడా జరిమానా తప్పదని హెచ్చరించారు.