మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 17 ఫిబ్రవరి 2018 (11:49 IST)

ప్రియా వారియర్ నటించిన పాటను తొలగించండి... ముస్లిం సంఘాలు

సోషల్ మీడియా సెలెబ్రిటీ ప్రియా వారియర్‌కు వివాదాలు తప్పేలా లేవు. ముస్లిం మనోభావాలను దెబ్బతీసేలా ప్రియా వారియర్ సైగలున్నాయని ఇప్పటికే కేసు నమోదైన నేపథ్యంలో.. ఆపె కనిపించిన పాటపై ముస్లింలు మండిపడుతున్నా

సోషల్ మీడియా సెలెబ్రిటీ ప్రియా వారియర్‌కు వివాదాలు తప్పేలా లేవు. ముస్లిం మనోభావాలను దెబ్బతీసేలా ప్రియా వారియర్ సైగలున్నాయని ఇప్పటికే కేసు నమోదైన నేపథ్యంలో.. ఆపె కనిపించిన పాటపై ముస్లింలు మండిపడుతున్నారు. ఈ మేరకు ఆ పాటను నిషేధించాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 
 
మలయాళ నటి ప్రియా వారియర్ నటించిన ''ఒరు ఆదార్ లవ్'' సినిమాలోని ''మాణిక్య మలరాయ పూవీ'' పాటను తొలగించాలని ముంబైకి చెందిన పలు ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ పాట మహమ్మద్ ప్రవక్త భార్యను తప్పుగా చూపిస్తోందని రజా అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు సయీద్ నూరీ వెల్లడించారు.
 
ఇదిలా ఉంటే.. టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ప్రియా వారియర్ కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మెగాహీరోల సినిమాలతో పాటు యువహీరో నిఖిల్ సరసన ఈ కేరళ భామ నటించబోతోందనే వార్తలు తెరపైకి వచ్చాయి.