1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 3 డిశెంబరు 2021 (17:51 IST)

క‌రోనా థార్డ్ వేవ్ పై భ‌యాందోళ‌న‌లో సినీ ప‌రిశ్ర‌మ - థియేట‌ర్లు మూత‌ప‌డ‌వ‌న్న‌ త‌ల‌సాని

Talasani and dilraju etc
క‌రోనా థార్డ్ వేవ్ వ‌చ్చేసింది. భార‌త్‌లోనే కొన్ని కేసులు వున్నాయంటూ వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆ ప్ర‌భావం సినిమా థియేట‌ర్ల‌పై ప‌డుతుంద‌ని తెలుగు సినిమా ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇలాంటి టైంలో బాలకృష్ణ అఖండ విడుద‌లైంది. ప్రేక్ష‌కులు అనూహ్యంగా థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. అయినా ఎక్క‌డో ద‌ర్శక నిర్మాత‌ల్లో శంక నెల‌కొంది. దీనిని నివృత్తి చేసుకోవ‌డానికి ప్ర‌ముఖ ద‌ర్శక నిర్మాత‌లు రాజ‌మౌళి, దిల్‌రాజు, మైత్రీ మూవీస్ అధినేత‌లు, రాధాకృష్ణ మొద‌లైన‌వారు తెలంగాణ సినిమా టోగ్ర‌పీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్‌ను శుక్ర‌వారంనాడు స‌చివాల‌యంలో క‌లిశారు.
 
Dil raju, Rajamolu and ohters
ఈ సంద‌ర్భంగా త‌ల‌సాని వారికి భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని భ‌రోసా ఇచ్చారు. థియేట‌ర్లు యాభై శాతం ఆక్యుపెన్సీ వంటివేవీ త‌మ వ‌ద్ద లేవ‌ని తేల్చిచెప్పారు. ప్ర‌జ‌లు థియేటర్ వెళ్లి సినిమా చుడండి. ఏ వేరియంట్ వచ్చినా తట్టుకునేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. థియేటర్ లు మూసివేయం .. ఇబ్బందులు లేవు.  
 
- అలాగే నిర్మాతలు ఆందోళన పడాల్సిన పనిలేదు. టికెట్ రేట్లు పెంచుకోవ‌చ్చ‌నే అంశం పెండింగ్ లో ఉంది. ఏది ఏమైనా నిర్మాతలకు నష్టం లేకుండా చూస్తాం అని తెలిపాఉ.
 
రాజ‌మౌళి, దిల్ రాజు బృందం సినిమాలోని అనేక అంశాలను ఈ సంద‌ర్భంగా మంత్రి ముందుకు తెచ్చారు.  పెద్ద సినిమాలు రిలీజ్ కోసం వేచి ఉన్నాయి. ఇప్ప‌టికే  కోవిడ్ కారణంగా సినిమా ఇండస్ట్రీ చాలా ఇబ్బందులు పడింది. మరోసారి ఇంకో వేవ్ వస్తుందనే ప్రచారం జరుగుతోంది వంటి ప‌లు విష‌యాలు విన్న మంత్రి  వారికి ధైర్యాన్ని చెబుతూనే ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.