గురువారం, 29 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 డిశెంబరు 2021 (11:04 IST)

ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ వాయిదా.. కారణం ఏంటంటే?

జక్కన్న ఫ్యాన్సుకు బ్యాడ్ న్యూస్. ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ వాయిదా పడే అవకాశం వుంది. ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ డిసెంబర్ 3వ తేదీన విడుదల కావాల్సింది. దీంతో అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ట్రైలర్ ను ముంబైలో స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసి రిలీజ్ చేయాలనుకున్నారు. 
 
ఈ ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ గెస్ట్‌గా వస్తారని కూడా అన్నారు. కానీ ఇప్పుడు చెప్పిన టైమ్ కి ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ రావడం లేదట. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ట్రైలర్ రిలీజ్‌ను వాయిదా వేస్తుంది చిత్రబృందం. డిసెంబర్ 10 లేదా 11 తేదీల్లో ట్రైలర్ ను విడుదల చేసే ఛాన్స్ ఉంది. 
 
కాగా బాహుబలి లాంటి భారీ సినిమా తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
 
జనవరి 7న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్లే ప్రమోషనల్ కార్యక్రమాలు షురూ చేశారు. ఇప్పటికే సినిమా నుంచి కొన్ని పాటలను, హీరోల పాత్రలకు సంబంధించిన టీజర్లను విడుదల చేశారు. ఇవన్నీ కూడా సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.