మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 5 మార్చి 2021 (17:55 IST)

దావూద్ ఇబ్రహీంపై `డి కంపెనీ` తెలుగు ట్రైలర్ విడుద‌ల (video)

D-companay trailer
అండర్ వరల్డ్ సినిమాలంటే అందరికీ ముందుగా గుర్చొచ్చేది సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. 'సత్య' 'కంపెనీ' వంటి సినిమాలలో అండర్ వరల్డ్ మాఫియా గురించి కళ్లకు కట్టినట్లు చూపించాడు వర్మ.

ఇప్పుడు ముంబైకి చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో 'డి-కంపెనీ' అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేసిన వర్మ.  తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. తెలుగు,హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీని మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

ట్రైలర్ లో వుంది ఇదే!
'డీ కంపెనీ' ట్రైలర్ చూస్తుంటే ఓ చిన్న గ్యాంగ్‌ లీడర్‌ నుంచి పెద్ద గ్యాంగ్‌ స్టర్‌ గా అండర్ వరల్డ్ ని శాసించే స్థాయికి ఎలా ఎలా ఎదిగాడన్నది ఇందులో చూపించబోతున్నారు. ఈ మూవీలో 1993 ముంబై బాంబు పేలుళ్ల గురించి, డి-కంపెనీ నీడలో బ్రతికిన ఇతర గ్యాంగ్‌ స్టర్ల గురించి తెలిజయేయనున్నాడు వర్మ.

డైలాగులు పవర్ ఫుల్ గా ఉన్నాయి. వర్మ స్టైల్లో కెమెరా యాంగిల్స్ కూడా డిఫరెంట్ గా, ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. అక్షత్ కాంత్, ఇర్రా మోర్,నైనా గంగూలీ, రుద్ర కాంత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీలో అప్సరా రాణి ఓ స్పెషల్ సాంగ్ చేసింది.
 
స్పార్క్ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై స్పార్క్ సాగర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ హిందీ,తెలుగు భాషల్లో ఈ నెల 26 ప్రేక్షకుల ముందుకు రానుంది.