బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 10 నవంబరు 2020 (19:39 IST)

వర్మ మన ఖర్మ... దటీజ్ వర్మ

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైన ఇప్పటివరకు కొన్ని పుస్తకాలు వచ్చాయి. అందరికీ తెలిసిందే. ఇప్పుడు వర్మ మన ఖర్మ అనే టైటిల్‌తో ఓ పుస్తకం వచ్చింది. ఈ పుస్తకాన్ని యువ రచయిత రేఖ పర్వతాల రాసారు. ఈ పుస్తకాన్ని సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో రామ్ గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై స్వయంగా ఆవిష్కరించారు.
 
చిన్న వయస్సులోనే రేఖ పుస్తకం రాయడం నిజంగా సంతోషం. తన గూర్చి ఏం రాశావు అని ఎప్పుడూ అడగలేదని.. ఆమె ఫ్యాషన్ ఆమెను పూర్తిచేసుకొమ్మన్నానని వర్మ వివరించారు. తాను ఎప్పుడూ ఒకే ఫిలాసఫీ ఫాలో అవ్వనని నా కన్వినెంట్ ప్రకారం అవి మారుస్తుంటానన్నారు. ప్రతీ మనిషిలో ఒక మృగం, రాక్షసుడు దాగి ఉంటారని దాన్ని బయటకు తీయడం తప్పు అని అందరూ అంటారని కాని మృగాన్ని బయటకు తీసి మనం చేయాలనుకున్నది చేయాలని తాను చెపుతానన్నారు.
 
తన సినిమాల గురించి స్పందిస్తూ... బర్నింగ్ టాపిక్స్ పైన తాను సినిమాలు తీయనని మంటలు ఆరాక సినిమాలు తీస్తానని రాంగోపాల్ వర్మ స్పష్టం చేశారు. సమస్యల గూర్చి ఎప్పుడూ పట్టించుకోనని ఆలోచిస్తే ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుంది కానీ... బాధపడితే మాత్రం లాభం ఉండదని అన్నారు వర్మ.