బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 17 ఫిబ్రవరి 2024 (16:49 IST)

19 ఏళ్ల దంగల్ నటి సుహానీ భట్నాగర్ కన్నుమూత

Suhani Bhatnagar
బాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకున్నది. దంగల్ చిత్రంలో నటించిన 19 ఏళ్ల సుహానీ భట్నాగర్ కన్నుమూశారు. 2016లో వచ్చిన దంగల్ చిత్రంలో బబితా ఫోగట్ పాత్ర పోషించిన నటి సుహానీ భట్నాగర్ శుక్రవారం ఢిల్లీలో కన్నుమూశారు. 19 ఏళ్ల నటి సుహానీ ఐసీయూలో చేరి ఫిబ్రవరి 16న తుదిశ్వాస విడిచినట్లు ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య సిబ్బంది తెలిపారు.
 
సుహాని మృతి పట్ల దంగల్ సహనటుడు అమీర్ ఖాన్ యొక్క ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సానుభూతి తెలిపింది. “మా సుహాని చనిపోయిందని విన్నందుకు మేము చాలా బాధపడుతున్నాము. ఆమె తల్లి పూజాజీకి, మొత్తం కుటుంబానికి మా హృదయపూర్వక సానుభూతి. సుహానీ, నువ్వు మా హృదయాల్లో ఎప్పటికీ స్టార్‌గా మిగిలిపోతావు, నీ ఆత్మగా శాంతి కలుగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము”.
 
సుహాని దంగల్‌లో బబితా ఫోగట్‌గా నటించింది. ఈ చిత్రంలో సన్యా మల్హోత్రా తన పెద్ద వయసులో నటించింది. సుహాని కొన్ని ప్రకటనల్లో కూడా నటించింది. సుహాని ఏడాది క్రితం ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఆమె కాలుకి ఫ్రాక్చర్ అయ్యింది. ఇక అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో ఆమెకి వాడుతున్న మందులు వికటించి శరీరం మొత్తానికి వ్యాపించినట్లు చెబుతున్నారు. ఆ కారణంగా ఆమె మృతి చెందినట్లు సమాచారం.