మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 జనవరి 2020 (16:03 IST)

సౌత్‌లో రజినీ దర్బార్.. రూ.200 కోట్ల కబ్ల్‌లోకి

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మరోమారు సత్తాచాటారు. ఆరు పదుల వయసులోనూ తనతో ఏ ఒక్క కుర్ర హీరో పోటీపడలేరని మరోమారు నిరూపించాడు. ఆయన నటించిన తాజా చిత్రం "దర్బార్". సెన్సేషనల్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తొలి ఆట నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి మంచి కలెక్షన్లతో ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. 
 
ముఖ్యంగా, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టింది. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టగా, తమిళనాడులో మాత్రం రూ.80 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇకపోతే, కేరళలో రూ.8 కోట్లు, కర్ణాటకలో రూ.19 కోట్లు, హిందీ వెర్షన్ ద్వారా రూ.8 కోట్లు, విదేశాల్లో రూ.70 కోట్లు వసూళ్లను రాబట్టింది. దీంతో రజినీ నటించిన మరో చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లో చేరినట్టయింది. గతంలో 'రోబో', 'కబాలి', '2.O', 'పేట' చిత్రాలు ఈ జాబితాలో ఉన్న విషయం తెల్సిందే.