1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Darling 4K Re-Release Worldwide Box Office Collection

రీ రిలీజ్‌లో దుమ్మురేపుతున్న ప్రభాస్ డార్లింగ్ మూవీ

darling movie
టాలీవుడ్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'డార్లింగ్'. గత 2010 ఏప్రిల్ 23వ తేదీన విడుదలైంది. ఈ చిత్రాన్ని ఇపుడు సరిగ్గా 16 యేళ్ల తర్వాత అంటే 2026 ఏప్రిల్ 23వ తేదీనే రీ రిలీజ్ చేశారు. 4కే క్వాలిటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.7.59 కోట్లు వసూలు చేసిం, తెలుగులో రీ రిలీజ్ అయిన చిత్రాల్లో రెండో అతిపెద్ద ఓపెనింగ్ మూవీగా నిలిచింది. అలాగే, ఈ చిత్రం విడుదలైన కేవలం మూడు రోజుల్లో రూ.10.44 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది. 
 
శ్రీవేంకటేశ్వర సినీ చిత్రం పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. తాజా రీ రిలీజ్‍‌ను కేదార్ ఫిల్మ్స్ పంపిణీ చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‍‌లోనూ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. థియేటర్ల వద్ద అభిమానులు పెద్ద ఎత్తుక కటౌట్లు, బాణాసంచాతో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ వసూళ్లు చూస్తుంటే 'డార్లింగ్' క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనే స్పష్టమవుతోంది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మీడియాకు వార్నింగ్ ఇస్తున్న బిగ్ బాస్ ఫేం అషురెడ్డి