సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 13 జనవరి 2022 (17:43 IST)

దర్శకరత్న, పేరుతో డాక్టర్ దాసరి నారాయ‌ణ‌రావు బయోపిక్

సినీరంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగానే కాదు అన్నింటా తానై, అందరివాడుగా వెలుగొందిన దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి అరుదైన వ్యక్తి జీవితం ఇప్పుడు వెండితెరకెక్కబోతోంది. 
 
`దర్శకరత్న'' పేరుతో ఆయన జీవితంలోని సంఘటనల సమాహారంతో రూపొందబోయే ఈ చిత్రాన్ని త్వరలో ప్రాంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇమేజ్ ఫిలింస్ పతాకంపై సీనియర్ దర్శకుడు ధవళసత్యం దర్వకత్వంలో తాడివాక రమేష్ నాయుడు నిర్మించే ఈ చిత్రం ముందస్తు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 
 
గతంలో రియల్ స్టార్ శ్రీహరి హీరోగా శ్రీశైలం వంటి భారీ బడ్జెట్ హిట్ సినిమాను ఇదే నిర్మాత నిర్మించిన సంగతి గుర్తుండే ఉంటుంది.  కాగా ఈ చిత్రం గురించిన విషయాలను తెలియజేసేందుకు  గురువారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్లో  చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.  
 
దర్శకుడు ధవళసత్యం తెలియజేస్తూ, చిత్ర పరిశ్రమలో మేరు శిఖరం అంత ఎత్హుకు ఎదిగి,  రచయితగా, దర్శక, నిర్మాతగా ఎందరెందరికో మార్గదర్శకుడైన దాసరి గారితో నాకున్న విడదీయలేని అనుబంధం ఈ చిత్రం చేసేందుకు నన్ను పురిగొల్పింది. దాంతో నాకు తెలిసిన,, ఆయన జీవితంలో నేను చూసిన అనేక సంఘటనలతో పాటు, ఆయనతో అనుబంధం ఉన్న అనేకమందిని సంప్రదించి, ఈ  చిత్రం స్క్రిప్ట్ ను అద్భుతంగా రూపకల్పన చేయడం జరుగుతోంది. తప్పకుండా దీనిని ఓ గొప్ప చిత్రంగా తెరకెక్కించేందుకు, దాసరి గారి పట్ల ఎనలేని అభిమానంతో పాటు మంచి అభిరుచి కలిగిన తాడివాక రమేష్ నాయుడు ముందుకు రావడం అభినందనీయం'' అని అన్నారు.
 
చిత్ర నిర్మాత తాడివాక రమేష్ నాయుడు మాట్లాడుతూ, కరోనా మూడవ వేవ్ రాకుంటే ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ఆరంభించే వాళ్లం. కరోనా పరిస్థితులు అదుపులోనికి రాగానే షూటింగ్ మొదలు పెడతాం. జాతీయ స్థాయి నటుడు ఈ చిత్రంలోని దాసరి గారి పాత్రను పోషిస్తారు. అలాగే దాసరి పద్మ పాత్రలో  గుర్తింపు ఉన్న నటి  నటిస్తారు. తెలుగు, హిందీ, తమిళ వంటి ఇండియాలోని పలు భాషలలో  ఓ పాన్ ఇండియా సినిమాగా ఎక్కడా రాజీ పడకుండా దీనిని రూపొందిచనున్నాం. అలాగే సీనియర్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు. దాసరి గారి బయోపిక్ కు పూర్తి న్యాయం చేయగల దర్శకుడిగా ధవళసత్యం మాత్రమే కరెక్ట్ అని నాకు అనిపించడంతో ఆయనను సంప్రదించాను'' అని చెప్పారు.
 
ఇదే ప్రెస్ మీట్లో పాల్గొన్న రేలంగి నరసింహారావు, సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి, నిర్మాతల మండలి  కార్యదర్శులు ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, నటుడు కాశీ విశ్వనాధ్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ ఖాజా సూర్యనారాయణ, తెలంగాణా ఫిలిం ఛాంబర్ చైర్మన్ పి.రామకృష్ణగౌడ్, సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు తదితరులు దాసరి వ్యక్తిత్వాన్ని, సేవాగుణాన్ని, ఆయనతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడారు.
 
 
---------------
త్వరలో దొరకునా ఇటువంటి సేవ" మూవీ
 
సమాజంలో జరిగే చెడు విషయాలను ప్రశ్నిస్తూ మంచి సినిమా తీయడం చాలా కష్టం.. ప్రస్తుతం అక్రమ సంబంధాల కి సంబంధించిన క్రైమ్ విపరీతంగా పెరిగిపోతుంది.
అవి భార్యాభర్తల గొడవలు, వాటిలో ఎవ్వరు తల దూర్చరు. పక్కింటోడు, పోలీసులు కాదు కదా ఆఖరికి పేరెంట్స్ కూడా తల దూర్చరు.. అందుకే అది ఈరోజు టాప్ క్రైమ్ గా మారింది. రీసెంట్ గా ఓ సర్వేలో తేలిన విషయం ఏంటంటే ప్రతి పది మందిలో ఏడుగురు అక్రమ సంబంధాలు ఇష్టపడుతున్నారనితేలింది.
 
క్షణికానందం కోసం అడ్డొస్తే అది ఎవరనేది కూడా చూడకుండా క్షణికావేశంలో చంపు కుంటూ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి కథలను
ఎవ్వరూ ధైర్యం చేయలేని విధంగా బోల్డ్ గా పక్కాగా తెర కి ఎక్కించినప్పుడు ఆ సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి అని ఎన్నో సినిమాలు నిరూపించాయి . ఈ సినిమా ద్వారా బోల్డ్ గా మెసేజ్ చెప్పే ప్రయత్నం చేశాము.
 
సందీప్ పగడాల, నవ్య రాజ్ హీరో హీరోయిన్లుగా... వెంకీ ద‌డ్‌బ‌జ‌న్‌, టి.ఎన్.ఆర్, రవి వర్మ, అపూర్వ, నక్షత్ర, బేబీ వీక్ష, మాస్టర్ రిత్విక్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), డీఐ అండ్ అట్మాస్ మిక్సింగ్: ఏయన్నార్ సౌండ్ అండ్ విజన్, పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందే, కలరిస్ట్: శివ కుమార్, సౌండ్ ఇంజినీర్: ఇనియన్ సిఎస్, ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్, కెమెరా: రామ్ పండుగల, మ్యూజిక్: యస్.యస్. ఫాక్టరీ, నిర్మాత: దేవ్ మహేశ్వరం, రచన-దర్శకత్వం: రామచంద్ర రాగిపిండి.