శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : గురువారం, 27 జూన్ 2019 (17:26 IST)

దాసరి కుటుంబంలో మళ్లీ మిస్సింగ్‌ల గోల.. ఈసారి దాసరి కోడలు...?

ఒకప్పుడు టాలీవుడ్‌కు పెద్దమనిషిలా వ్యవహరించి ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా తాను ఉన్నానంటూ అండగా నిలిచి వారి సమస్యలను పరిష్కరించిన వ్యక్తిగా దివంగత దర్శకుడు దాసరి నారాయణరావుకు పేరుంది. ఇప్పుడు అలాంటి ఆయన కుటుంబానికి సంబంధించి వస్తున్న వార్తలు షాకింగ్‌కి గురిచేస్తున్నాయి.


ఈ మధ్య దాసరి కుమారుడు దాసరి ప్రభు జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నెంబరు 46లో ఉన్న తన నివాసం నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోవటం తెలిసిందే. దీంతో పోలీసులు హడావుడిగా విచారణ జరపడం, ప్రభు కోసం వెతుకులాట మొదలుపెట్టడం తెలిసిందే.
 
ఇదిలా ఉండగా ఆయనే స్వయంగా జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తనను కొంతమంది కిడ్నాప్ చేశారంటూ పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. దీంతో ఆయన మిస్సింగ్ కేసును పోలీసులు మూసేశారు. మరో ప్రక్క ఆయన పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రోజే ఆయన సతీమణి సుశీల, ఆమె తల్లి సావిత్రమ్మలు మాసాబ్ ట్యాంక్‌లోని ఓ హోటల్లో ఉన్నట్లుగా చెబుతున్నారు.
 
ఆ తర్వాత నుంచి వారు కనిపించకుండా పోయారని చెబుతున్నారు. తాజాగా తన సోదరి, తన తల్లి కనిపించటం లేదంటూ దాసరి కోడలు సోదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె చిత్తూరు జిల్లా పూతల పట్టులో ఉంటారు. తాజా ఫిర్యాదు మేరకు దాసరి కోడలు, ఆమె తల్లి కోసం పోలీసులు శోధన మొదలు పెట్టారు. ఒక ప్రముఖుడి ఇంటికి చెందిన కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరుగా తప్పిపోవడం పోలీసులను తలలు పట్టుకునేలా చేస్తోంది.