శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 25 జూన్ 2019 (14:12 IST)

పేరు చివరన రెడ్డి అనే తోక లేదనీ... పెళ్లిని ఆపేసిన వరుడు

తెలుగు రాష్ట్రాల్లో కులం ఫీలింగ్ నానాటికీ ఎక్కువైపోతోంది. ముఖ్యంగా, కొన్ని సామాజికవర్గాలకు చెందిన యువత విధిగా తమ పేరు చివరన తమ కులం పేరును జతచేస్తున్నారు. ఈ క్రమంలో ఆధార్ కార్డులో రెడ్డి అనే రెండు అక్షరాలు లేవన్న కారణంతో ఓ యువకుడు పీటలపై పెళ్లిని ఆపేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన వెంకట రెడ్డి అనే యువకుడికి క్రోసూరు మండలం గాదెవారిపాలెంకు చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహం పెదకాకాని శివాలయంలో ఈ నెల 22న జరగాల్సి ఉంది. ఇందుకోసం ఏర్పాట్లను కూడా ఘనంగా చేశారు. 
 
అయితే, వివాహ నమోదు సమయంలో వధువు, ఆమె తండ్రి ఆధార్‌ కార్డుల్లో పేరు చివరన రెడ్డి అని లేకపోవడంతో వరుడి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పిన వరుడు.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో వధువు కుటుంబ సభ్యులు పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలను పిలిచి విచారిస్తున్నారు.