శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : సోమవారం, 24 జూన్ 2019 (17:12 IST)

ఇక్కడి శివలింగం.. పౌర్ణమికి తెలుగు-అమావాస్యకు నలుపు రంగులోకి..?

భక్తుల హృదయాలపై ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే సుప్రసిద్ధ పంచారామ క్షేత్రాలలో సోమారామం ఒకటి. ఈ ఆలయాన్ని సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయం అంటారు. తూర్పు గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని గుణిపూడి గ్రామంలో ఈ క్షేత్రం వెలసింది.


భక్త సులభుడైన శివయ్య ఇక్కడ సోమేశ్వరస్వామి పేరుతో నిత్య పూజలందుకుంటూ ఉంటాడు. ఇక్కడి శివలింగం పౌర్ణమి రోజుకి తెలుపు రంగులోకి అమావాస్య నాటికి నలుపు రంగులోకి మారుతూ వుంటుంది. 
 
చంద్రుడు ప్రతిష్టించిన కారణంగానే, ఆయనని అనుసరిస్తూ ఈ శివలింగం రంగుమారుతూ ఉంటుందని చెబుతుంటారు. మరి ఇలా మారడనికి అసలు రహస్యం ఏంటి, ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
 
పంచారామాలలో రెండవదైన సోమారామము రాజమండ్రికి 59 కి.మీ. దూరంలో, విజయవాడకు 91 కి.మీ. దూరంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి 2 కి.మీ. దూరంలో ఉన్న గుణిపూడిలో కలదు. మామూలు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి మాత్రం గోధుమ రంగులో మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి మామూలు స్థితికి వచ్చేస్తుంది. 
 
ఇది శతాబ్దకాలంగా జరుగుతోందని ఇక్కడి పూజారులు చెబుతున్నారు. ఈ మార్పులను గమనించాలంటే అమావాస్యతో పాటు పౌర్ణమి రోజున దేవాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. ఇక ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించడం వెనుక కూడా ఓ పురాణ కథ వుంది. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోనూ, అన్నపూర్ణాదేవి పై అంతస్తులోనూ ఉంటారు. 
 
ఇలా శివుడి పైన అమ్మవారు ఉండటం దేశంలో మరెక్కడా లేదని చెబుతారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్ధన స్వామి. దేవాలయం ముందు భాగంలో రెండు నందులు ఉండగా ధ్వజస్తంభం వద్ద మరో నంది ఉంటుంది. అటుపై ఆలయ ప్రాంగణంలో ఒక నంది, దేవాలయం ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిణిలో మరో నంది ఉంటుంది. అందువల్లే ఈ క్షేత్రానికి పంచనందీశ్వర దేవాలయం అని కూడా పేరు. 
 
ఇదిలా ఉండగా ఆలయం ముందు భాగాన ఉన్న కోనేరు గట్టున రాతి స్తంభంపై ఉన్న నందీశ్వరుడి నుంచి గర్భాలయంలోకి చూస్తే శివలింగం కనిపిస్తుంది. మూల విరాట్టు కింది అంతస్తులో అయితే అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుంచి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. ఈ క్షేత్రంలోని చంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పటాపంచలవుతాయని విశ్వసిస్తూ వుంటారు. 
 
తూర్పు చాళుక్యరాజైన చాళుక్య భీముడు ఈ దేవాలయాన్ని మూడో శతాబ్దంలో నిర్మించాడు. ఈ దేవాలయానికి ప్రాకారాలను, గోపురాన్ని నిర్మించాడనడానికి చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి. అందువల్లే ఈ క్షేత్రానికి భీమారామం అనే పేరు కూడా ఉంది.