Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

బాలీవుడ్లో.. కామ్రేడ్. ఈ రీమేక్‌లో న‌టించే హీరో ఎవ‌రు..?

Written By శ్రీ
Updated: గురువారం, 25 జులై 2019 (22:35 IST)
సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన తాజా చిత్రం డియ‌ర్ కామ్రేడ్. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ విభిన్న క‌థా చిత్రం సాంగ్స్, టీజ‌ర్ విశేషంగా ఆక‌ట్టుకోవ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. గీత గోవిందం సినిమాలో జంట‌గా న‌టించిన విజ‌య్ దేవ‌ర‌కొండ - ర‌ష్మిక ఈ మూవీలో కూడా న‌టించ‌డంతో ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూద్దామా అని ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. 
 
ఈ నెల 26న తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయితే.. ఈ సినిమాని త్వరలో హిందీలో రీమేక్ చేయనున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాని హిందీలో ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ రూపొందించ‌నున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా తెలియ‌చేసారు.
 
డియర్ కామ్రేడ్ సినిమాని నిర్మాత నవీన్ ఎర్నేని, దర్శకుడు భరత్ కమ్మ, హీరో విజయ్‌తో కలిసి ఆయన చూశారు. సినిమా తనను ఎంతో ఆకట్టుకుందని, కదిలించిందని ఆయన పేర్కొన్నారు. అయితే.. హిందీ రీమేక్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించ‌నున్నాడు అని.. ఈ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే విష‌యం గురించి విజ‌య్‌ని అడిగితే... డియ‌ర్ కామ్రేడ్ హిందీ రీమేక్‌లో న‌టించ‌డం లేద‌ని చెప్పారు. మ‌రి.. డియ‌ర్ కామ్రేడ్ రీమేక్‌లో ఎవ‌రు న‌టిస్తారో చూడాలి. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Custard apples సీతాఫలాలు వచ్చాయి, తినేవారు తెలుసుకోవాల్సినవి

Almonds బాదం పప్పులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?

చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

తర్వాతి కథనం
Show comments