ఆదివారం, 24 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 31 మే 2023 (14:55 IST)

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో డియర్ జిందగీ ప్రారంభం

on Raja Ravindra clap by  V. V. Vinayak
on Raja Ravindra clap by V. V. Vinayak
ప్రశాంతమైన కాలనీలో ఉండాలని వచ్చిన ఫ్యామిలీకి వారి పిల్లల వలన ఆ ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. చివరికి ఆ తండ్రి పిల్లలకి తోడుగా ఉండి సొసైటీలో తన ఫ్యామిలీని చూసి గర్వపడేలా ఎలా చేసుకున్నాడనే ఒక క్రేజీ ఫ్యామిలీ డ్రామా కథే "డియర్ జిందగి". రాజారవీంద్ర సమర్పణలో ‘సాయిజా క్రియేషన్స్’, మహా సినిమా పతాకంపై రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, నీల ప్రియా, మిర్చి కిరణ్, హర్షవర్ధన్, నటీనటులుగా పద్మారావ్ అబ్బిశెట్టి (పండు) దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. 
 
 ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి లు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిలిం నగర్ దైవ సన్నిదానంలో పూజా కార్యక్రమాలు ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు వి. వి. వినాయక్ నటుడు రాజా రవీంద్ర పై క్లాప్ ఇవ్వగా, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కెమెరా స్విచ్చాన్ తో పాటు గౌరవ దర్శకత్వం వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు వి. వి. వినాయక్ నటుడు రాజా రవీంద్ర పై క్లాప్ ఇవ్వగా, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కెమెరా స్విచ్చాన్ తో పాటు గౌరవ దర్శకత్వం వహించారు. 
 
అనంతరం రాజా రవీంద్ర మాట్లాడుతూ.. రెగ్యులర్ గా కాకుండా కొత్త కాన్సెప్ట్ తో ప్రస్తుతం సమాజంలో జరిగే సమస్యలు ఎత్తి చూపుతూ, మంచి కాన్సెప్ట్ తో తీస్తున్న ఈ సినిమాలో నేను ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇందులో నాకు ముగ్గురు పిల్లలు ఉంటారు. వీరు చేసే పనులకు ఫ్రస్ట్రేట్ తెప్పించే ఫాదర్ గా చాలా రోజుల తరువాత ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇలాంటి మంచి సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
నిర్మాత శరత్ చంద్ర చల్లపల్లి మాట్లాడుతూ..మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన వి. వి. వినాయక్ గారికి, కళ్యాణ్ కృష్ణ గారికి ధన్యవాదములు. ఫ్రెండ్స్ తో కోలాబ్రేట్ అయ్యి ప్రేక్షకులకు మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలను అందించాలనే ఉద్దేశ్యంతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాము అన్నారు.
 
సహ నిర్మాత క్రాంతి ముండ్ర మాట్లాడుతూ..ఇది ఒక మంచి క్రేజీ ఫ్యామిలీ కథ. ఇప్పటి వరకు ఇలాంటి కథ రాలేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ఇందులో హీరో అని కాకుండా కథే హీరో, కథకు తగ్గట్టు ఇందులోని ప్రతి క్యారెక్టర్ ఒక ఆర్క్ గా వుంటుంది అన్నారు.
 
లిరిక్ రైటర్ రాంబాబు గోశాల మాట్లాడుతూ .."కాంతారా" సినిమా తరువాత ఈ కథ నచ్చడంతో ఈ సినిమాకు అన్ని పాటలు రాయడం జరిగింది. మంచి కథతో వస్తున్న ఈ సినిమాకు మంచి పాటలు సెట్ అయ్యాయి. ఇలాంటి మంచి సినిమాకు ప్రేక్షకులందరి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నటుడు శివ చందు, నటి యశస్విని, నీల ప్రియ కెమెరామెన్ సిద్ధార్థ స్వయంభు మాట్లాడుతూ ఇలాంటి మంచి సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు