గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 31 మే 2023 (09:09 IST)

నేడు వైజాక్‌కు చంద్రబాబు.. వివాహాది శుభకార్యాలయాలకు హాజరు

chandrababu naidu
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం విశాఖపట్టణం పర్యటనకు వెళుతున్నారు. సాయంత్రం 3 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు వెళుతారు. సాయంత్రం 4 గంటలకు విశాఖకు చేరుకుని, ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో అచ్యుతాపురానికి వెళతారు. అక్కడ యలమంచిలి టీడీపీ ఇన్‌ఛార్జ్ ప్రగడ నాగేశ్వర రావు నివాసానికి చేరుకుంటారు. ఇక్కడ ఇటీవల జరిగిన నాగేశ్వర రావు కుమారుడు రాజు - కోడలు భాను నూతన దంపతులను ఆశీర్వదిస్తారు.
 
ఆ తర్వాత సాయంత్రం 6.30 గంటలకు చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్టు స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించి, ఉడా పార్కులో బి.వెంకటరమణయాదవ్ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఆయన వైజాగ్ నుంచి తిరిగి విజయవాడకు వెళతారు.