బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 30 మే 2023 (15:23 IST)

బ్లాక్ కమాండోలను తొలగిస్తే చంద్రబాబు ఫినిష్... ఏపీ స్పీకర్ తమ్మినేని

tammineni
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న జడ్ ప్లస్ భద్రతపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనలోని అక్కసును వెళ్లగక్కారు. కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న బ్లాక్ కమాండోలను తొలగిస్తే చంద్రబాబు ఫినిష్ అవుతారంటూ హెచ్చరించారు. బ్లాక్ కమాండో ఫోర్స్ ఉందన్న ధైర్యంతోనే చంద్రబాబు నోటికి పని చెబుతున్నారని ఆయన అన్నారు. 
 
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జరిగిన వైకాపా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ఎవరిని ఉద్ధరించడానికి చంద్రబాబుకు బ్లాక్ కమాండోస్ భద్రత. రాష్ట్ర శాసనసభాపతిగా ఈ భద్రతను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తాను. జెడ్ ప్రస్ క్యాటగిరీ భద్రతకు చంద్రబాబు ఏ విధంగా అర్హులు. దేశంలో చాలా మందికి హెచ్చరికలు వస్తుంటాయి. వారందరికీ ఈ తరహా భద్రత కల్పిస్తారా. ఇది ఏమాత్రం సరైన చర్య కాదు అని అన్నారు.