శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (09:54 IST)

డబ్బులు చెల్లించని సినీ పొలిటికల్ సెలెబ్రిటీలు .. ట్విటర్ బ్లూ టిక్ తొలగింపు

blue tick
అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులకు చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతాలకు ఉండే బ్లూ టిక్‌ను ఆ సంస్థ తొలగించింది. బ్లూ టిక్ సేవలు కావాలనుకునేవారు ప్రతి నెల డబ్బులు చెల్లించాల్సిందేనని ట్విట్టర్ సీపీఈ ఎలాన్ మస్క్ తేల్చి చెప్పారు. అయితే, అనేక మంది సెలెబ్రిటీలు డబ్బులు చెల్లించలేదు. దీంత బ్లూటిక్‌ను తొలగించింది. బ్లూటిక్ కోల్పోయిన వారిలో రాజకీయ నేతలు, సినీ సెలెబ్రిటీలు, స్టార్ క్రికెటర్లు కూడా ఉన్నారు. షారూక్ ఖాన్, అమితాబ్, అలియా భట్, యోగి ఆదిత్యనాథ్, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఎంకే స్టాలిన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇలా అనేక మంది ఉన్నారు. 
 
గత 2009లో ట్విట్టర్ బ్లూ టిక్ సిస్టంను అందుబాటులోకి తెచ్చింది. ఈ బ్లూ టిక్ ఉన్న సెలెబ్రిటీలు, రాజకీయ నేతలు, క్రికెటర్లు, సంస్థల ఖాతాల ఒరిజినల్ అని లెక్కగా భావించేవారు. ఇతరులు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసినా అవి ఒరిజినల్ కావని యూజర్లకు అర్థమయ్యేలా ఈ బ్లూ టిక్ విధానాన్ని ట్విట్టర్ ప్రవేశపెట్టింది. ఇపుడు బ్లూ టిక్‌లకు డబ్బులు చెల్లించాలని ఆ సంస్థ అధిపతి మస్క్ కొత్త విధానం తీసుకొచ్చారు. సంస్థకు ఆదాయాన్ని సమకూర్చుకునే చర్యల్లో భాగంగా, ఈ పాలసీని తీసుకొచ్చారు. కానీ, అనేక మంది తమ ఖాతాలకు డబ్బులు చెల్లించేందుకు ఆసక్తి చూపించడం లేదు.