సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 ఏప్రియల్ 2023 (12:39 IST)

ప్రధాని మోడీ - బీజేపీ నేతలకు మంత్రి కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్....

ktrao
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ నేతలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. గత తొమ్మిదేళ్ళ కాలంలో తెలంగాణ రాష్ట్రం కంటే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందిందో చెప్పగలరా అంటూ ఆయన నిలదీశారు. ఈ సవాల్ విసిరి చాలా రోజులు అయిందని, ఇంతవరకు ఒక్కరంటే ఒక్క బీజేపీ నేత కూడా తన సవాల్‌ను స్వీకరించలేదన్నారు. గత తొమ్మిదేళ్ళలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అత్యుత్తమంగా అభివృద్ధి సాధించిందని తెలిపారు. 
 
గత తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో తెలంగాణ మినహా దేశంలోని ఏ ఇతర రాష్ట్రం ఈ విధంగా అభివృద్ధి చెందిందో బీజేపీ నేతలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఛాలెంజ్‌‌ను ప్రధాని నరేంద్ర మోడీకి కూడా విసురుతున్నట్టు చెప్పారు. ప్రధాని మోడీ కానీ, ఏదైనా బాధ్యతాయుతమైన బీజేపీ కేంద్ర మంత్రిగానీ ఈ సవాల్‌పై స్పందించాలని మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. అయినప్పటికీ ఏ ఒక్క బీజేపీ నేత కూడా స్పందించలేదని ఆయన గుర్తు చేశారు.