గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2023 (19:26 IST)

ఉప్పు పిరం.. పప్పు పిరం.. పెట్రోల్ పిరం.. డీజిల్ పిరం : మంత్రి కేటీఆర్ వ్యంగ్య ట్వీట్

ktrao
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో పెరిగిపోయిన ధరలను ప్రధానంగా చేసుకుని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని.. ప్రియమైన మోడీ అని కాకుండా పిరమైన మోడీ అనాలంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు కేటీఆర్ చేసిన కవితాత్మక ట్వీట్‌లో ఆయా ధరల పెరుగుదలపై వచ్చిన వార్తల క్లిప్పింగ్స్‌ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 
 
ఉప్పు పిరం.. పప్పు పిరం..
పెట్రోల్ పిరం.. డీజిల్ పిరం
గ్యాస్ పిరం..
గ్యాస్‌పై వేసిన దోశ పిరం
అన్నీ పిరం.. పిరం...
జనమంతా గరం... గరం... 
అందుకే అంటున్న
ప్రియమైన ప్రధాని... మోడీ కాదు.. 
“పిరమైన ప్రధాని.. మోడీ.." అంటూ వ్యాఖ్యానించారు.