సెల్ఫీ కావాలంటే.. రూ.500 చెల్లించాలి.. మంత్రి కేటీఆర్ సరదా వ్యాఖ్యలు
తనతో సెల్ఫీ ఫోటో కావాలంటే రూ.500 చెల్లించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ సరదాగా వ్యాఖ్యానించారు. నిజానికి మంత్రి కేటీఆర్‌కు యువతలో అమితమైన క్రేజ్ వుంది. అందుకే ఆయన కనిపిస్తే చాలు ఆయనతో సెల్ఫీ, ఫోటోలు దిగేందుకు ప్రతి ఒక్కరూ అమిత ఉత్సాహం చూపిస్తుంటారు. అలాగే, మంత్రి కేటీఆర్ కూడా అడిగినవారికి కాదనకుండా సెల్ఫీలు, ఫోటోలు దిగుతుంటారు.
తాజాగా ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా యువత ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. అయితే, అడిగినవారిని కాదనకుండా మంత్రి ఫోటోలకు ఫోజులిచ్చారు. కానీ, అభిమానుల తాడికి ఎక్కువైపోవడంతో సెల్ఫీ కావాలంటో రూ.500 ఖర్చు అవుతుందంటూ సరదాగా కామెంట్స్ చేశారు.
అయితే, మంత్రి కేటీఆర్‌ను చూసిన సంతోషంలో ఉన్న అభిమానులు, యువత ఈ కామెంట్స్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. ప్రస్తుత మంత్రి కేటీఆర్ సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.