సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 మార్చి 2023 (09:06 IST)

ఆర్థిక సమస్యలు.. విశాఖ జోడీ సూసైడ్ సెల్ఫీ వీడియో

suicide
విశాఖపట్నంలో అదృశ్యమైన జంట ఆత్మహత్య సెల్ఫీ వీడియో పంపింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగి, అతని భార్య ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వీడియో పంపారు. మంగళవారం ఆత్మహత్య నిర్ణయాన్ని తెలియజేస్తూ ఓ జంట సెల్ఫీ వీడియోను బంధువులకు పంపింది.
 
వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగి చిత్రాడ వరప్రసాద్ (47), అతని భార్య మీరా (41) నగరంలోని తిరుమల నగర్‌లో నివసిస్తున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వీడియో తీసి పంపారు.
 
దీంతో వారి కుమారుడు కృష్ణ వెంటనే దువ్వాడ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కొప్పాక ఏలేరు కాలువ సమీపంలో పాదరక్షలు, హ్యాండ్ బ్యాగ్, మొబైల్‌ను గుర్తించిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.