మంగళవారం, 16 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 మార్చి 2023 (17:47 IST)

అమ్మాయిలను పంపాలని బెల్లంపల్లి ఎమ్మల్యే ఒత్తిడి చేశారు.. మహిళ ఆరోపణ

woman victim
తెలంగాణ రాష్ట్రంలోని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే చిన్నయ్య అమ్మాయిలను పంపాలంటూ తనను ఒత్తిడి చేశారంటూ ఆరోపించారు. ఈ మేరకు ఆ మహిళ చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియో, ఆడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
బెల్లంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఓ డెయిరీ నిర్వాహకురాలు చేసిన ఆరోపణలను పరిశీలిస్తే, ఎమ్మెల్యే చిన్నయ్య డెయిరీ ఏర్పాటుకు డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ ఆరోపించారు. పైగా, అమ్మాయిలను పంపాలంటూ ఒత్తిడి తెచ్చారని అన్నారు. తాము సహకరించకపోవడంతో తమపై తప్పుడు కేసులు పెట్టించి, ఆయన అనుచరులతో బెదిరిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్న ఈ వీడియో, ఆడియోలను ఎమ్మెల్యే చిన్నయ్య ఖండించారు.