బుధవారం, 16 అక్టోబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 మార్చి 2023 (13:50 IST)

యూరోపియన్ లీగ్.. బౌలర్ విసిరిన బంతి బ్యాటర్‌కు అక్కడ తగిలింది.. (వీడియో)

European League
European League
క్రికెట్ ఫీల్డులో అప్పుడప్పుడూ ప్రమాదాలు జరుగుతుంటాయి. క్రికెటర్లు అప్పుడప్పుడు గాయాల పాలవుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే యూరోపియన్ లీగ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్రదర్స్ ఎలెవన్, ఇండియన్ రాయల్స్ మధ్య 10 ఓవర్ల మ్యాచ్ జరిగింది. 
 
ఇండియన్ రాయల్స్ ఇన్నింగ్స్ సమయంలో క్రీజులో వున్న బ్యాటర్ మిడాన్ దిశగా ఆడగా.. సింగిల్ పూర్తి చేశారు. అయితే తర్వాత ఫీల్డర్ మిస్ ఫీల్డ్ చేయడంతో రెండో పరుగు కోసం పరిగెత్తారు. 
 
ఈ క్రమంలో బంతిని అందుకున్న ఫీల్డర్ నాన్ స్ట్రైక్ ఎండ్ వైపు పరిగెత్తిన బ్యాటర్ వైపు విసిరాడు. ఎవరూ ఊహించని రీతిలో బంతి పొట్టకు కింది భాగంలో తగిలింది. దెబ్బ గట్టిగా తగలడంతో బ్యాటర్ నొప్పితో విలవిల్లాడాడు. గార్డ్ వేసుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఇక మ్యాచ్ సంగతికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బ్రదర్స్ ఎలెవన్ నిర్ణీత 10 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇరు జట్ల స్కోరు సమానంగా వుండటంతో గోల్డెన్ బాల్ అవకాశం ఇచ్చారు. గోల్డెన్ బాల్‌లో బ్రదర్స్ ఎలెవన్ జట్టు విజయం సాధించింది.