ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (16:48 IST)

ఇటలీలో పెను విషాదం... శరణార్థుల పడవ మునిగి 27 మంది మృతి

boat sinks
ఇటలీ దేశంలో పెను విషాదం సంభవించింది. శరణార్థులతో వస్తున్న పడవ ఒకటి సముద్రంలో మునిగిపోయింది. దీంతో 27 మంది మృత్యువాతపడ్డారు. ఈ శరణార్థులంతా ఇరాన్, పాకిస్తాన్, ఆప్ఘనిస్థాన్ దేశాలకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ఓ పసికందు కూడా ఉంది. చనిపోయిన వారి మృతదేహాలు ఓ గ్రామంలోని తీరానికి కొట్టుకుని వచ్చాయి. దీంతో అక్కడ పెను విషాదం నెలకొంది. 
 
తమ సొంత దేశంలో జీవించలేక, స్థానికంగా నెలకొన్న భయానక పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు శరణార్ధులుగా అనేక మంది అక్రమ మార్గంలో వెళుతూ ఇలా సముద్ర ప్రమాదాలకు గురవున్నారు. 
 
తాజాగా, ఇటలీ తీరంలో శరణార్థులతో వస్తున్న పడవ మునిగిపోవడంతో 27 మంది మృత్యువాత పడ్డారు. మృతిచెందిన వారిలో ఓ పసికందు కూడా ఉండడం స్థానిక అధికారులను కలచివేసింది. ఈ పడవలో 100 మందికి పైగా శరణార్థులు ఉన్నట్టు ఇటలీ కోస్ట్ గార్డ్ అధికారులు భావిస్తున్నారు. 
 
వారంతా ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ కు చెందినవారిగా గుర్తించారు. కోట్రోన్ ప్రావిన్స్ లోని కలాబ్రియా గ్రామం వద్ద తీరానికి మృతదేహాలు కొట్టుకొని వచ్చాయి. అలల ఉద్ధృతికి సముద్రంలోని బండరాళ్లను బోటు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బోటు మధ్యకు విరిగిపోవడంతో శరణార్థులు నీటిలో మునిగిపోయారు.