శనివారం, 13 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 మార్చి 2023 (22:56 IST)

మార్కెట్లోకి నోకియా C12 స్మార్ట్‌ఫోన్: మార్చి 17న అమేజాన్‌లో సేల్

Nokia
Nokia
నోకియా C12 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రానుంది. సొగసైన నోర్డిక్ డిజైన్‌ను ఇది కలిగి ఉంది. 3000 mAh బ్యాటరీతో పనిచేసే ఈ ఫోన్.. 6.3 అంగుళాల HD+ స్క్రీన్, Unisac 9863A1 ప్రాసెసర్ వంటి ఫీచర్లను కలిగివుంటుంది. 
 
ఇంతకుముందు యూరోపియన్ మార్కెట్‌లో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భారతదేశంలో లాంచ్ చేయబడిందని HMD గ్లోబల్ తెలిపింది. 
 
కొత్త Nokia C12 మోడల్‌లో 6.3 అంగుళాల HD+ స్క్రీన్, Unisac 9863A1 ప్రాసెసర్, 2GB ర్యామ్, 2GB అదనపు మెమరీ సదుపాయాలు ఇందులో వున్నాయి.
 
ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఓఎస్‌తో నడుస్తున్న నోకియా సి12 రెండేళ్లపాటు త్రైమాసిక భద్రతా అప్‌డేట్‌లను అందుకుంటుందని HMD గ్లోబల్ ప్రకటించింది. నాణ్యతతో కూడిన ఫోటోల కోసం 8MP ప్రైమరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరాను అందించడం జరిగిందని హెచ్‌ఎండీ గ్లోబల్ తెలిపింది. 
 
నోకియా C12 స్మార్ట్‌ఫోన్ డార్క్ సియాన్, చార్‌కోల్, లైట్ మింట్ రంగులలో లభిస్తుంది. పరిచయ ఆఫర్‌గా, ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 5,999 ధరకు విక్రయించబడుతోంది. ఇది మార్చి 17న అమేజాన్‌లో విక్రయానికి రానుంది.