గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 మార్చి 2023 (16:24 IST)

తక్కువ ధరకే రెడ్‌మీ నుంచి రెడ్ మి 12సి.. ఫీచర్స్ సంగతేంటంటే?

Redmi 12C
Redmi 12C
రెడ్‌మీ తన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి 12సిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. భారతదేశంలో అత్యధిక స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించే కంపెనీలలో రెడ్‌మీ ఒకటి. ఎన్నో ఫీచర్లు, ఆధునిక సాంకేతికతలతో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్న రెడ్‌మీ.. ఇప్పుడు తక్కువ ధరకే ఓ మోస్తరు ఫీచర్లతో రెడ్‌మీ 12సి అనే కొత్త మోడల్‌ను విడుదల చేసింది. 
 
Redmi 12C స్మార్ట్‌ఫోన్ ముఖ్యాంశాలు:
MediaTek Helio G85 ప్రాసెసర్
మాలి G52 MC2 GPU
4 GB / 6 GB RAM
64 GB / 128 GB అంతర్గత మెమరీ (మెమొరీ కార్డ్ స్లాట్‌తో)
5 ఎంపీ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా
50 MP + 2 MP వెనుక ప్రైమరీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, FM రేడియో,
5000 mAh బ్యాటరీ, 10W ఫాస్ట్ ఛార్జింగ్
 
4జీ ఫీచర్‌తో రెడ్‌మీ 12సీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఇది బ్లాక్, బ్లూ, మింట్, పర్పుల్ అనే నాలుగు రంగులలో లభిస్తుంది. 4GB/64GB, 4GB/128GB, 6GB/128GB మూడు మెమరీ సామర్థ్యాలతో ఈ స్మార్ట్‌ఫోన్ భారతీయ విక్రయాలు త్వరలో ప్రారంభం కానున్నాయి.