నడకదారిలో వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. దివ్యదర్శనం టోకెన్లు  
                                       
                  
                  				  శ్రీ వేంకటేశ్వర స్వామి నడకదారిలో వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది.  అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లో వచ్చే భక్తులకు త్వరలో దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయనుంది. 
				  											
																													
									  
	 
	నడక మార్గాల్లో వచ్చే భక్తుల్లో 60 శాతం మంది వద్ద దర్శన టిక్కెట్లు వుండటం లేదని గుర్తించామని కాబట్టి వారికి దివ్యదర్శం టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించినట్లు టీటీడీ ఈవో ఏపీ ధర్మారెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నామని, అది అందుబాటులోకి రాగానే టోకెన్ల జారీ ప్రారంభిస్తామన్నారు. 
				  
	 
	శ్రీవాణి దర్శన టికెట్లు కలిగిన భక్తులకు తిరుమలలోని ఎస్ఎన్‌జీహెచ్, ఏటీజీహెచ్ అతిథి గృహాల్లో 88 గదులు కేటాయించినట్టు తెలిపారు.