సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 డిశెంబరు 2022 (13:04 IST)

శబరిమల యాత్ర.. లోయలో పడిన టెంపో.. 8 మంది భక్తుల మృతి

road accident
అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల యాత్ర చేపట్టిన భక్తుల టెంపో ప్రమాదానికి గురైంది. లోయలో టెంపో పడిపోవడంతో ఎనిమిది మంది అయ్యప్ప భక్తులు మృతి చెందారు. తీవ్ర గాయాల కారణంగా ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వుందని.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన అయ్యప్ప భక్తులు టెంపో ద్వారా శబరిమలకు ప్రయాణమైనారు. వీరి టెంపో రళలోని ఇడుక్కి జిల్లా కుమిలి-కంబం రహదారిపై వెళ్తుండగా వాగులోకి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.