గురువారం, 29 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2022 (14:01 IST)

బోల్తాపడిన టాటా ఏస్ వాహనం : నలుగురు అయ్యప్ప భక్తుల మృతి

road accident
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏస్ వాహనం బోల్తా పడటంతో నలుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది గాయపడ్డారు. 
 
కొందరు అయ్యప్ప భక్తులతో వెళుతున్న టాటా ఏస్ వాహనం బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని అనే గ్రామం సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
వీరిని కృష్ణా జిల్లా నిలపూడి గ్రామానికి చెందిన పాపం రమేశ్ (55), బోలిశెట్టి పాండురంగారావు (40), బోదిన రమేష్ (42), బుద్ధన పవన్ కుమార్‌లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ ప్రమాదంలో గాయపడిన 15 మంది క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమైవుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.