శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 డిశెంబరు 2022 (08:39 IST)

అగ్నిప్రమాదం.. నిద్రలోనే ఐదుగురు సజీవదహనం

fire
మంచిర్యాలలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. 
 
వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా, మందమర్రి మండలం, వెంకటాపూర్‌కు చెందిన శివయ్య, ఆయన భార్య ఇద్దరు కుమార్తెలు ఈ ఘటనలో మృతి చెందారు. 
 
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. కానీ ఐదుగురు ప్రాణాలు మాత్రం అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతుంది.