గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (14:47 IST)

పార్టీ లేదా బావా...? ఎన్టీఆర్ ట్వీట్... వస్తున్నా... అల్లు అర్జున్ రిప్లై

arjun - ntr
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌‌ల మధ్య ఓ సరదా సంభాషణ జరిగింది. ప్రస్తుతం వీళ్లద్దరి ట్విటర్‌ చాట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 'బావ' అనే పదం ట్విటర్‌ ట్రెండింగ్‌లోకి చేరింది. ఇంతకీ ఈ ఇద్దరు హీరోల మధ్య ఏం సంభాషణ జరిగిందో తెలుసుకుందాం. 
 
అల్లు అర్జున్ తన 41వ పుట్టినరోజు వేడుకలను శనివారం జరుపుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్‌మీడియా వేదికగా ఆయనకు శుకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌ సైతం బన్నీకి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్‌ చేశారు. 
 
'హ్యాపీ బర్త్‌డే బావ. ఈ ఏడాది నీకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా' అని తారక్‌ ట్వీట్‌ చేయగా దానిపై బన్నీ స్పందిస్తూ.. 'నీ లవ్లీ విషెస్‌కు థ్యాంక్యూ బావా. నీకు నా హగ్స్‌..' అని రిప్లై ఇచ్చారు. 
 
దీనిపై ఎన్టీఆర్‌ తనదైనశైలిలో సమాధానం ఇస్తూ.. 'కేవలం హగ్స్‌ మాత్రమేనా? పార్టీ లేదా పుష్ప?' ('పుష్ప' చిత్రంలోని డైలాగ్‌) అంటూ స్మైలీ ఎమోజీని యాడ్‌ చేశారు. దీనికి పుష్పరాజ్‌ (అల్లు అర్జున్‌).. 'వస్తున్నా' అని కన్నుగీటారు. ఇలా.. వీరిద్దరూ తమ క్రేజీ ప్రాజెక్ట్‌లోని స్పెషల్‌ డైలాగ్స్‌ని ఉద్దేశిస్తూ ట్వీట్స్‌ చేసుకోవడంపై సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.