బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 ఏప్రియల్ 2023 (23:00 IST)

అమ్మవారి వేషంలో రౌద్రం ఉట్టిపడేలా పుష్ప-2... రికార్డుల మోత

Pushpa
Pushpa
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 గెటప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. బన్నీ ఇలాంటి గెటప్‌ వేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. పుష్ప-2 ద రూల్ నుంచి  విడుదలైన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ రికార్డుల మోత మోగిస్తోంది. సోషల్ మీడియాలో అత్యధిక లైకులు పొందిన ఫస్ట్ లుక్‌గా చరిత్ర సృష్టించింది. 
 
అమ్మవారి వేషంలో రౌద్రం ఉట్టిపడేలా కనిపిస్తున్న అల్లు అర్జున్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పుష్ప-2 ప్రకంపనలు సృష్టిస్తోంది. 
 
బన్నీ ఫస్ట్ లుక్‌కు ఇన్ స్టాగ్రామ్‌లో 50 లక్షల లైకులు, ఫేస్ బుక్ లో 8.50 లక్షల లైకులు, ట్విట్టర్‌లో 2.07 లక్షల లైకులు వచ్చాయి.