శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 8 ఏప్రియల్ 2023 (18:47 IST)

పుష్ప రాజ్ సోషల్ మీడియాను శాసిస్తున్నాడు

Allu Arjun,
Allu Arjun,
అల్లు అర్జున్ పుష్ప రాజ్ లుక్ తో అదరగొట్టాడు. 8వతేదీ అల్లు అర్జున్ పుట్టినరోజు కనుక నిన్న పుష్ప 2 టీజర్ ను విడుదల చేశారు. దానికి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత పుష్ప రాజ్ కొత్త గెటప్ కు వచ్చిన స్పందన చూసి పుష్ప రాజ్ సోషల్ మీడియాను శాసిస్తున్నాడు అంటూ చిత్ర యూనిట్ తెలిపింది. హ్యాపీ బర్త్ డే అల్లుఅర్జున్ అంటూ అన్ని సమయాలలో అత్యంత ఇష్టపడే మొదటి లుక్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. 
 
“పుష్ప ది రూల్”. సెన్సేషనల్ హిట్ పుష్ప 1 కి సీక్వెల్ గా వస్తున్నది. ఇండియా లెవెల్లో  అంచనాలు పెరిగిపోయాయి. ఇక సినిమా ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేసాక మాసివ్ రెస్పాన్స్ దానికి రాగ ఊహించని ఫస్ట్ లుక్ తో అయితే బన్నీ క్రేజీ ట్రీట్ ని అందించాడు. 24 గంటలు కంప్లీట్ కాకుండానే 1 లక్ష 50 వేలకి పైగా లైక్స్ అందుకున్న ఫస్ట్ లుక్ గా కూడా బన్నీ పేరు తెచ్చుకున్నాడు.