శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 జనవరి 2024 (08:45 IST)

జపాన్ భూకంపంపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి...

jr ntr
కొత్త సంవత్సరం రోజున జపాన్ దేశం భారీ భూకంపంతో వణికిపోయింది. దీనిపై టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. జపాన్‌‍లో సంభవించిన వరుస భూకంపాల ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి కొత్త సంవత్సరం వేడుకలను జపాన్‌లో జరుపుకున్నారు. అలాగే, ఆయన చిత్రం షూటింగ్ కూడా జపాన్‌లో జరిగింది. ఒకవైపు షూటింగ్ పూర్తికావడంతో, మరోవైపు, కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుని సోమవారం రాత్రి హైదరాబాద్ నగరానికి తిరిగివచ్చారు. తాను నటిస్తున్న కొత్త చిత్రం దేవర షూటింగులో వారం రోజుల జపాన్‌లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జపాన్‌లో సంభవించిన వరుస భూకంపాలపై ఆయన స్పందించారు. 
 
"దేవర" చిత్రీకరణ జరిపిన ప్రాంతంలో భూకంపం రావడం తన హృదయాన్ని కలిచివేసిందన్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు త్వరగా కోలుకోవాలని తారక్ ట్వీట్ చేశారు. జపాన్ దేశంలో సోమవారం దాదాపు 21 సార్లు భూమి కంపించిన విషయం తెల్సిందే. దీంతో జపాన్ పశ్చిమ ప్రాంతం అల్లకల్లోలమైంది. ఈ భూకంపం ధాటికి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. వరుసగా సంభవించిన భూకంపాలతో ప్రభుత్వం తొలుత భారీ సునామీ హెచ్చరికలు చేసింది. దీంతో సముద్రతీర ప్రాంతాల వాసులను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత సునామీ హెచ్చరికల తీవ్రతను తగ్గించింది.