గురువారం, 18 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 6 ఏప్రియల్ 2024 (16:28 IST)

ప్రజాస్వామ్యం తరహాలో ప్రేక్షకులు ద్యారా వర్మ చేస్తున్న యువర్ ఫిల్మ్ ఐడియా

RGV
RGV
RGV డెన్ వేదికగా ఈరోజు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘యువర్ ఫిల్మ్’ అనే కాన్సెప్ట్ ని ప్రెస్ మీట్ ద్వారా వివరించారు. ప్రేక్షకులే సినిమా హిట్ ఫ్లాప్ నిర్ణయిస్తారు కాబట్టి, ఆ ప్రేక్షకులే సినేమాకు సంబందించిన హీరో, హీరోయిన్, డైరక్టర్, సినిమాటోగ్రాఫర్ ఇలా అన్ని టెక్నీషియన్స్ ను RGV వెబ్సైట్ ద్వారా ఓటింగ్ పద్దతిలో, ప్రజలే ఎన్నుకుని, అందులో ముందంజలో ఉన్న వారితో సినిమా చిత్రీకరణ RGV నిర్మాతగా ఆరు నెలలలో తీసి రిలీజ్ చేస్తారు. 
 
సినిమా కథనీ RGV వెబ్సైటులో (rgvden.com) ఒక రెండు లైన్లులో పెట్టి, ఆ కథ లైను నచ్చిన ఆక్టర్స్, డైరెక్టర్స్, డిఓపి, మూజిక్ డైరక్టర్ ఇలా అందరూ కూడ అప్లై చేసుకోవచ్చు, ప్రేక్షకులు ఇంటరెస్ట్ ఉండి అప్లై చేసుకున్న ప్రతి డిపార్ట్మెంట్ వారికి, ఎవరి వర్క్ నచ్చిందో వారిని ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకుంటారు.. ఉదాహరణకి హీరో కొసం ఒక 1000 మంది అప్లై చేస్తే అందులో నుండి ఒక 50 మందిని RGV డెన్ టీమ్ షార్ట్ లిస్ట్ చేసి వెబ్సైట్ లో పెడతారు, ఆ తరవాత RGV పెట్టే టాస్క్ లని బట్టి వారు ఆడిషన్స్ ఇస్తూ ఉంటారు, ఆ ఆడిషన్స్ లో ప్రేక్షకులకు ఎక్కువ ఎవరు నచ్చితే అతను హీరోగా సినిమా తీస్తారు, ఇదే తరహాలో హీరోయిన్, డైరెక్టర్స్, డిఓపి ఇలా అందరూ కూడా ప్రేక్షకుల ద్వారా ఎన్నుకోబడతారు.. 
 
ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం ఎన్నుకున్నదే ప్రజాస్వామ్యం అలానే ప్రెక్షకుల చేత, ప్రేక్షకుల కొరకు, ప్రేక్షకుల కోసం చేసే సినిమాలే ఈ యువర్ ఫిల్మ్ ఐడియా, ఈ యువర్ ఫిల్మ్ అనేది భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల వారితో నిర్మాణం RGV డెన్ నుండి జరుగుతుంది