గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : సోమవారం, 31 జులై 2017 (16:30 IST)

శవంతో శృంగారం 'దేవీశ్రీప్రసాద్'... పోసాని ఎంట్రీతో...

శవంతో శృంగారం చేయడమనే మానసిక రుగ్మత... దానినే నెక్రోఫీలియా అని వైద్య పరిభాషలో చెప్తారు. అసలు శవంతో శృంగారం అనే మాట వినడానికే హేయంగా, జుగుప్సగా అనిపిస్తుంది. కానీ ఈ పాయింటునే ఇతివృత్తంగా తీసుకుని తెలుగ

శవంతో శృంగారం చేయడమనే మానసిక రుగ్మత... దానినే నెక్రోఫీలియా అని వైద్య పరిభాషలో చెప్తారు. అసలు శవంతో శృంగారం అనే మాట వినడానికే హేయంగా, జుగుప్సగా అనిపిస్తుంది. కానీ ఈ పాయింటునే ఇతివృత్తంగా తీసుకుని తెలుగులో ఓ సినిమా రాబోతోంది. ఇలాంటివి బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చినప్పటికీ తెలుగులో మాత్రం ఇదే తొలి సినిమా. 
 
శవంతో శృంగారం ముందు దేవీశ్రీప్రసాద్ ఏంటా అనుకుంటున్నారు కదూ... ఈ పేరు సంగీత దర్శకుడిది కాదు... దేవీ, శ్రీ, ప్రసాద్ అనే ముగ్గురు యువకుల చుట్టూ తిరిగే కథ అంటూ పోసాని కృష్ణమురళి చిత్ర ట్రెయిలర్ ద్వారా క్లారిఫికేషన్ ఇస్తూ చెప్తాడు. 
 
ఇకపోతే ఈ చిత్రంలో ఓ హీరోయిన్ కారు ప్రమాదంలో చనిపోతుంది. ఆమె శవాన్ని మార్చురీలో పెడతారు. ఆ శవాన్ని బయటకు తీసి ముగ్గురు యువకులు దానితో శృంగారం చేస్తారు. ఈ సీన్‌ను దర్శకుడు చూపించేశాడు. మరి ఇలాంటి సీన్లకు సెన్సార్ బోర్డు ఒప్పుకుంటుందో లేదో చూడాలి.