మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 20 జనవరి 2018 (14:11 IST)

''ధడక్'' ద్వారా శ్రీదేవి కుమార్తె ''జాహ్నవి'' తెరంగేట్రం..

అలనాటి తార, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి తెరంగేట్రానికి వేళైంది. మరాఠీలో హిట్టైన 'సైరత్' చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కుతున్న‌ 'ధ‌డ‌క్' అనే సినిమాలో జాహ్నవి హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రా

అలనాటి తార, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి తెరంగేట్రానికి వేళైంది. మరాఠీలో హిట్టైన 'సైరత్' చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కుతున్న‌ 'ధ‌డ‌క్' అనే సినిమాలో జాహ్నవి హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రాన్ని జలై20వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత కరణ్ జోహార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంతేగాకుండా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. 
 
శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సవతి సోదరుడు ఇషాన్ ఖట్టర్ హీరోగా నటిస్తున్నాడు. అగ్రకులానికి చెందిన అమ్మాయి, నిమ్న కులానికి చెందిన అబ్బాయిల మధ్య కలిగిన ప్రేమ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆరు నెలల పాటు ఈ సినిమా షూటింగ్‌ను జరుపుతామని కరణ్ జోహార్ అన్నారు. జీ స్టూడియోస్, ధర్మా మూవీస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి.