1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 3 మే 2024 (15:58 IST)

ధనుష్-శేఖర్ కమ్ముల.. కుబేర నుంచి నాగార్జున లుక్

nagarjuna look
nagarjuna look
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడుగా.. నేషనల్ అవార్డు విన్నర్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న సోషల్ డ్రామా ‘కుబేర’. మైథలాజికల్ పాన్ ఇండియన్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కింగ్ నాగార్జున ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. స్టార్ స్పోర్ట్స్ వేదికగా IPL 2024 ప్రసారం మధ్యలో విడుదల చేసిన నాగార్జున ఫస్ట్ లుక్, గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.
 
సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ IPL గేమ్ సమయంలో కింగ్ నాగార్జున ఫస్ట్ లుక్‌ను టెలికాస్ట్ చేశారు. ఈ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వర్షం పడుతుండగా గొడుగు పట్టుకుని కళ్లద్దాలు పెట్టుకుని మ్యాన్లీగా కనిపించారు కింగ్ అక్కినేని నాగార్జున.
 
ఈ చిత్రంలో ధనుష్, కింగ్ నాగార్జున అక్కినేని, రష్మిక మందన్న, జిమ్ సర్భ్‌తో పాటు భారీ తారాగణం నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏకకాలంలో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో చిత్రీకరిస్తున్నారు.