ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2024 (17:52 IST)

సిద్ధాంతాలు, విలువలు పాటించి సినిమాలు తీస్తాను : దర్శకుడు శేఖర్ కమ్ముల

Director Shekhar Kammula
Director Shekhar Kammula
నేషనల్అవార్డ్ విన్నర్ దర్శకుడు  శేఖర్ కమ్ముల 2007 లో వచ్చిన సినిమా హ్యపీడేస్. ఈ సినిమాను అప్పట్లో విమర్శకుల ప్రశంసలను కూడా పొందింది. అంతా కొత్తవారితో తీసిన ఆ సినిమాను మరలా ఏప్రిల్ 19 న రి రిలీజ్ చేస్తున్నారు. ఇక  దర్శకుడు  శేఖర్ కమ్ముల 2000లో  డాలర్ డ్రీమ్స్ చిత్రంతో దర్శకుడు గా వెలుగులోకి వచ్చారు. ఆ తరవాత హ్యాపీ డేస్ నుంచి లవ్ స్టోరీ వరకు పలు సినిమాలు చేశారు. 

ఆయన సినిమా అంటే ఓ బ్రాండ్. మంచి విలువలతో సినిమాలు చేస్తున్న ఆయన దర్శకుడిగా  24 ఏళ్ళు పూర్తి చేసుకుని 25 ఏట  ప్రవేశించిన సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల పలు విషయాలను మీడియాతో సంభాఫించారు.
 
హ్యాపీడేస్ అనగానే మెమొరీస్ గుర్తుకువస్తాయి. మరలా రీరిలీజ్ కు మీకు గుర్తుకు వచ్చిన సంఘటనలు వున్నాయా?
ఇన్నేళ్ళు అయినా మళ్ళీ మళ్ళీ కాలేజీకి రావాలి. మళ్లీ మళ్ళీ సినిమా చూడాలి అనిపించేలా ఆ సినిమా వుంటుంది. సంగీతం కూడా అంత బాగుంటుంది. ఏదైనా ఔట్ డేట్ అవుతుందేమోనని నేను మొన్ననే మరలా చూశాను. కానీ చాలా ఫ్రెష్ గా వుంది. రీరిలీజ్ కూడా యూత్ కు ఓ పండుగలా వుంటుందనిపించింది. టైసన్ పాత్ర చాలా మేజిక్ గా వుంటుంది.
 
హ్యాపీడేస్ సీక్వెల్ గా ఏదైనా అనుకున్నారా.?
నాకు అనిపించింది. కానీ కథ ఫామ్ కాలేదు. 
 
అప్పటికీ ఇప్పటికీ కాలంలో మార్పులు వచ్చాయి కదా? ఏదైనా కొత్త ఆలోచన వచ్చిందా?
హ్యాపీడేస్ సినిమా చేస్తున్నప్పుడు నా గ్రాడ్యుయేసన్ పూర్తయి పదేళ్ళు అయింది. కానీ ఇప్పటికీ చూసినా కరెక్టే అనిపించేలా వుంది. స్టూడెంట్ బ్యాక్ గ్రౌండ్ అప్పటి పరిస్థితులరీత్యా కుదిరాయి. అయితే నేడు టెక్నాలజీ మారింది. సెల్స్ ఫోన్స్ ప్రతి స్టూడెంట్ చేతిలో వున్నాయి. కోవిడ్, గ్లోబలైజేషన్ వంటి పరిస్థితుల తర్వాత ఆలోచన విధానం తప్పకుండా మారుతుంది. టెక్నాలజీపరంగా ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరి లోకంలో వారు వున్నారు. 
 
ట్రెండ్ కు తగినట్లు కథ రాసుకోవచ్చుగదా?
ఇంకా అనుకోలేదు.
 
25 సంవత్సరాల జర్నీ చూసుకుంటే ఏమనిపిస్తుంది?
సినిమా చేసి సక్సెస్ అవ్వాలనుకోవడం, నిలబడడం చూస్తే చాలా గర్వంగా వుంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నా విలువలకు తగినట్లు సినిమా తీయడం గొప్పగా అనిపిస్తుంది. నేను ఏ సినిమా చేసినా విలువలు, సిద్దాంతాలు, చెడు చెప్పకూడదు అనే ఫార్మెట్ లో పోతాను. నెగెటివ్ సంఘటనలు చాలా బెటర్ గా చూపించవచ్చు అనిపిస్తుంది. నేను పేరు, డబ్బు కోసం సినిమా రంగానికి రాలేదు. అలా అని సినిమాలూ తీయలేదు. అదే నాకు గర్వంగా వుంది. ఇప్పుడు సినిమా రంగంలో పోకడ చాలా హార్ష్ గా వుంది.
 
 మీ కెరీర్ మీకు చాలా స్లోగా అనిపించిందా?
నాకు అలా అనిపించలేదు. నేను సినిమా చేసే పద్దతి, నా సినిమాలే మాట్లాడతాయి. కాపీ కొట్టే కథలు నేను చేయను. కంటెంట్ పరంగా బాగా చెప్పాలనుకుంటాను. చెప్పేది సూటిగా వుంటుంది. మనసులో ఆలోచన రావడం అది కార్యరూపం దాల్చడానికి సమయం పడుతుంది. అలా కాకుండా తొందరగా చేయాలనుకోను. అలా చేస్తే గడిబిడి అయిపోతాం.
 
ఈరోజుల్లో హిట్ రాగానే దర్శకులు ఛాలా ముందుంటున్నారు?
నేను ఏ సినిమా చేసినా  ఈ కథ అవసరమా? అని ఆలోచించి చేస్తాను. మేకింగ్ పరంగాచాలా ఫాస్ట్ గా వుంటాను. కానీ థింకింగ్ పరంగా స్లోగా వుంటాను.
 
ఏషియన్ బేనర్ తో మీ జర్నీ చాలా కంఫర్ట్ గా వుందనిపిస్తుంది. అలా అయ్యేవారు దొరకడం కష్టం మీరేమంటారు?
నాకు వారితో జర్నీ అలా మొదలైంది. ఫ్రీడం, నమ్మకం అనేది ఇరువురి మధ్య వుండాలి. అది కూడా మంచి పరిణామమే.
 
థనుష్, నాగార్జున గారితో పెద్ద సినిమా చేస్తున్నారు? మీ నుంచి ఏ స్థాయిలో సినిమాను ఆశించవచ్చు?
పెద్ద స్కేల్ సినిమా. పెద్ద ఐడియాతో వుండే సినిమా గా వుంటుంది. ముందుగా చెప్పకూడదు. కానీ నాగార్జున, ధనుష్ అనే వారు కథకు యాప్ట్ అని చేస్తున్నా. ఫిలాసఫీలో ఇంట్రెస్టింగ్ టాపిక్ వుంటుంది. 
 
దర్శకుడికి ఎత్తు పల్లాలు వుండడం మామూలే. మీ నుంచి నోస్ చెప్పాలంటే ఏం చెబుతారు.
నా సినిమాలో కల్ట్ బ్యాక్ డ్రాప్ కనిపిస్తుంది. పని, పాపులారిటీ మనం చేసేవిధాానంతో వస్తాయి. మనీపరంగా ఆలోచించకుండా చేయడమే నా తత్త్వం. అదే నాకు గొప్పగా అనిపిస్తుంది.
 
లీడర్ కు సీక్వెల్ వుంటుందా?
నాకు తీయాలని మైండ్ లో వుంది. కానీ సమయం కుదరడంలేదు. చేస్తే తప్పకుండా మరలా రానా తో నేచేస్తా.
 అప్పట్లో ఆ సినిమాలో లక్ష కోట్లు అవినీతి అంటే చాలా ఎక్కవు అని అన్నారు.  కానీ ఇప్పుడు మరింత దిగజారిపోయాయి. ఒక పర్సన్ గురించి చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా చెప్పాలి. ఇవన్నీ కుదరాలంటే కాస్త సమయం పడుతుంది.
 
రాజకీయాలు పాడైపోయినప్పుడు సినిమా తీయడానికి మరింత సబ్జెక్ట్ లు వుంటాయిగదా?
లీడర్ లో ఏమి చేసినా చివరికి రియలైజ్ కు వస్తాడు. కానీ ఇప్పుడు ఏది చెప్పాలన్నా దానికి సొల్యూషన్ లాజిక్ గా చెప్పాలి. అందుకు చాలా టైం పడుతుంది. ఏదైనా సమస్య చెబితే దాని పరిష్కారం కూడా చెప్పగలగాలి. కథలు రాయవచ్చు. కానీ మంచితనం సొల్యూషన్ అనేది చాలా కష్టంగా మారింది. మంచే గెలుస్తుంది. చెడు ఓడిపోతుంది. అనేది ప్రాక్టికల్ గా చెప్పాలి.
 
ఏదైనా కొత్తవారితో చేయడం అనేది కూడా కథ ప్రకారమే.. ఇప్పుడు చేయబోయే కుబేర సినిమా కూడా ఈ పాత్రకు ఇతనే వుండాలి. అని రాసుకున్నదే. లీడర్ సినిమా రానాతోనే చేయాలి. కొత్తవారితో చేయాలని ట్రై చేస్తే దెబ్బతింటాం.
 
నేషనల్ అవార్డు అందుకున్నారు. మరలా రీచ్ అయ్యే ఆలోచన వుందా?
అలా అనుకోలేదు. నేను కాంప్రమైజ్ కాకుండా సినిమా తీస్తున్నాను. అందుకే నేను హ్యాపీగా వున్నాను. ప్రజలు ఇచ్చే అవార్డే గొప్పది. అవార్డు అనేది షడెన్ గా వస్తుంటాయి. మనకంటే బెటర్ గా సినిమాలు నేషనల్ లెవల్ లో వుంటున్నాయి. వాటినీ అంగీకరించాలి. ఏడాది ఏడాదికి జాతీయ స్థాయిలో అంచనాలు మారుతుంటాయి. కంటెంట్ పరంగా మంచిది తీసుకుని చేయడమే మన పని.
 
నేడు పాన్ఇండియా లెవల్లో సినిమా వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు?
కథ పరంగా మన నేటివిటీకి తగినట్లు చెప్పగలగాలి. కోవిడ్ తర్వాత పాన్ ఇండియా లెవల్ మారింది. వాటికి తగినట్లు సినిమా తీస్తే తప్పకుండా ఆ లెవల్ కు చేరుతుంది. ఇందుకు ప్రేక్షకుల మైండ్ సెంట్ కూడా గమనించాలి అని ముగించారు.