నయనతార మాజీ ప్రియుడు కెట్టవన్? : లేఖా వాషింగ్టన్
తమిళ సినీ ఇండస్ట్రీని కూడా 'మీటూ' ఉద్యమం కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురు ముందుకు వచ్చి తమకు ఎదురైన అనుభవాలను వెల్లడిస్తున్నారు. తాజాగా లేఖా వాషింగ్టన్ అనే హీరోయిన్ ఆ హీరోపై సంచలన ఆరోపణలు చేసింది. ఆయనో 'కెట్టవన్' అంటూ ఆరోపణలు గుప్పించింది. పైగా, తాను నటించిన ఆ 'కెట్టవన్' చిత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదని వాపోయింది.
ఇంతకీ ఆ కెట్టవన్ (చెడ్డ వ్యక్తి) ఎవరోకాదు. హీరోయిన్ నయనతార మాజీ ప్రియుడు, తమిళ యువ హీరో శింబు. ఈ హీరోతో కలిసి నటించిన చిత్రం లేఖా వాషింగ్టన్. ఈ చిత్రం షూటింగ్ సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించింది.
తనతో ఓ నటుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సోషల్ మీడియాలో ఆరోపణలు చేసింది. ఆమె తన ఆరోపణల్లో భాగంగా 'కెట్టావన్' అని తను నటించిన చిత్రం (విడుదల కాలేదు) పేరును వాడటంతో ఆ చిత్ర హీరోపైనే లేఖ ఆరోపణలు చేసిందని తమిళ ఫిలిం ఇండస్ట్రీలో పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో సదరు హీరోకు సంబంధించిన అభిమానులు ఆమెపై విరుచుకుపడుతున్నారు.