గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 11 నవంబరు 2024 (13:18 IST)

బ్రహ్మానందం ప్లేస్ ను వెన్నెల కిశోర్ రీప్లేస్ చేశాడా?

Vennela Kishore,  Brahmanandam
Vennela Kishore, Brahmanandam
తెలుగు సినిమాల్లో ఇప్పటి జనరేషన్ కు బ్రహ్మానందం గురించి చెప్పనవసరంలేదు. కొన్నేళ్ళుగా తెలుగు సినిమాను తన నటనతో ఏలిన బ్రహ్మానందం ఇప్పుడు ఊసుపోక చిన్నపాటి పాత్రలు వేయడం తెలిసిందే. దర్శకులు జంథ్యాల పుణ్యమా నాటకాన్ని నుంచి వెండితెరపైకి వచ్చిన బ్రహ్మానందం తన ప్రతిభతో ఎటువంటి పాత్రనైనా మెప్పించే ప్రయత్నం చేశారు. ఓ దశలో అగ్ర హీరోలు కూడా బ్రహ్మానందం డేట్స్ కోసం వేచిచూసిన సందర్భాలున్నాయి.

అప్పట్లో ఆయన్ను కాదని మరొకరిని ఫుల్ ఫిల్ చేయడానికి ఏ నిర్మాతకూ, దర్శకుడికీ లేకపోయేది. ఎందుకంటే గత్యంతరలేకపోవడమే. రానురాను కాలంతోపాటు పరిణామాలు మారాయి. సునీల్ వంటి నటుడు వున్నా ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకోవడంతో గేప్ అలానే వుంది. ఈమధ్య సత్య అనే నటుడు వెలుగులోకి వచ్చాడు. 
 
అయితే ఆయన నటనను ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. కానీ బ్రహ్మానందాన్ని భర్తీచేసేనటుడుకాదు. ఈ అవకాశం వెన్నెల సినిమాలో నటించిన కిశోర్ కు దక్కిందని రచయిత గోపీమోహన్ అన్నారు. వెన్నెల సినిమా హిట్ తో  వెన్నెల కిశోర్ గా మారిపోయాడు. ఒకప్పుడు శ్రీనువైట్ల సినిమాలో చిన్న వేషంకావాలని వేచిచూశాడు. అందుకుచాలాకాలం పట్టింది. ఆయన్ను నేరుగా కలిసే అవకాశం లేకపోవడంతో రచయిత గోపీమోహన్ ను ఆశ్రయించాడు. ఆయన ద్వారా శ్రీనువైట్లకు పరిచయం అయి మీ సినిమాలో వేషం వేయాలనుందని అడగడంతో దూకుడు సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది.
 
అలాంటి వెన్నెల కిశోర్ ఇప్పుడు ఏ నటుడికైనా మంచి సపోర్టింగ్ గా  నిలిచాడు. ఆమధ్య శ్రీవిష్ణు నటించిన సామజవరగమన సినిమాలో సెకండాఫ్ లో వచ్చే వెన్నెల కిశోర్ సినిమాను హైలైట్ చేశాడు. అలా ప్రతిసినిమాకూ హైలైట్ అయిన ఆయన తాజాగా ధూంధాం సినిమాలో నటించాడు. దానికి రచయితగా గోపీమోహన్ వున్నాడు. ఆయనే వెన్నెల కిశోర్ ను తీసుకున్నారు. ఈ సినిమాలో సెండాఫ్ లో సినిమాను నిలబెట్టాడు. ఆయనే లేకపోతే సినిమా నిలబడేదికాదని గోపీమోహన్ వెల్లడించారు. ఒకప్పుడు బ్రహ్మానందం అలా వుండేవాడు. ఇప్పుడు ఆయన స్తానంలో వెన్నెల కిశోర్ వచ్చాడనుకుకోవచ్చని చెప్పడం విశేషం.