శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 29 జూన్ 2023 (17:19 IST)

దిల్‌రాజు ఘనంగా చేస్తున్న తన కొడుకు పుట్టినరోజు వేడుక

Dil Raju ph
Dil Raju ph
దిల్‌రాజు తన కుమారుడు అన్వీరెడ్డి పుట్టినరోజును ఘనంగా చేయనున్నారు. ఈరోజు సాయంత్రం జూబ్లీహిల్స్‌, టోలీచౌక్‌ మధ్యలోగల జె.ఆర్‌.సి. ఫంక్షన్‌లో జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన కుమార్తె, అల్లుడు నిర్వహిస్తున్నారు. ఇందుకు సినీరంగ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఫంక్షన్‌ హాల్‌ పూర్తి ఏర్పాట్లను ఈరోజు మధ్యాహ్నం నుంచే చేశారు.
 
ఇక దిల్‌ నిర్మిస్తున్న శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌ జరుగుతోంది. కియారా అద్వానీ నాయికగా నటిస్తోంది. ఈ సినిమా కొద్దిరోజుల గేప్‌ తీసుకుంది. ఇవికాకుండా కొత్త బేనర్‌ స్థాపించి తన సోదరుడు కుమారుడు, కుమార్తెలు సినిమాలు తీస్తున్నారు. అందులో భాగంగానే బలగం చిత్రం రూపొందింది. మంచి హిట్‌ అయింది. ఇంకా పలు వెబ్‌ సిరీస్‌ కూడా రూపొందుతున్నాయి.