ఆదివారం, 17 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2016 (12:30 IST)

అది చూశాకే నిజం తెలిసింది.. 'గోదావరి గట్టోళ్ళు' ఇంతమంది ఉన్నారా: దాసరి ప్రశ్న

ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన సినీ ప్రముఖుల విశేషాలతో రూపొందిన 'గోదావరి గట్టోళ్ళు.. గట్సున్న గొప్పోళ్లు' అనే పుస్తకాన్ని దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు ఆదివారం ఆయన స్వగ్రుహంలో ఆవిష్కరించారు.

ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన సినీ ప్రముఖుల విశేషాలతో రూపొందిన 'గోదావరి గట్టోళ్ళు.. గట్సున్న గొప్పోళ్లు' అనే పుస్తకాన్ని దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు ఆదివారం ఆయన స్వగ్రుహంలో ఆవిష్కరించారు. రాజమండ్రిలో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న బి.ఎస్.జగదీష్ రచించిన ఈ పుస్తకాన్ని దర్శకరత్న డా.దాసరి నారాయణ రావు ఆవిష్కరించి.. తొలిప్రతిని ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహరావుకు అందజేశారు. 
 
ఈ కార్యక్రమంలో మరో దర్శకనటుడు కాశీ విశ్వనాథ్, దర్శకుడు రాజవన్నెం రెడ్డి, నటుడు సారిక రామచంద్రరావు, రచయిత బిఎస్ జగదీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శక రత్న దాసరి నారాయణ రావు మాట్లాడుతూ జగదీష్ రావు గుంటూరు జిల్లాకు చెందిన వారైనప్పటికీ ఉభయ గోదావరి జిల్లాల సినీ ప్రముఖులపై ఇలాంటి పరిశోధనాత్మక రచనలు చెయ్యడం అభినందనీయ. ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఇంత మంది దిగ్గజాలాంటి సినీ ప్రముఖులు చిత్ర పరిశ్రమలో ఉన్నారన్న నిజం ఈ పుస్తకం చూశాకే తెలిసింది. ఇలాంటి విశేష కృషి చేసిన జగదీష్‌కి ఉభయ గోదావరి జిల్లాల సినీ ప్రముఖుల తరుపున నా క్రుతజ్ఞతలు. వ్యక్తిగతంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అన్నారు. 
 
పుస్తక రచయిత జగదీష్ మాట్లాడుతూ “నా ఈ చిరు ప్రయత్నాన్ని అభినందిస్తు పుస్తకాన్ని ఆవిష్కరించిన దర్శకరత్న దాసరి నారాయణ రావుకి, తొలి ప్రతిని స్వీకరించిన రేలంగి నరసింహారావుకి ఇతర సినీ ప్రముఖులకు నా క్రుతజ్ఞతలు” అన్నారు.