శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 మే 2024 (13:36 IST)

నాగ్ అశ్విన్ ట్వీట్‌.. బుజ్జిని డ్రైవ్ చేయడానికి ఎలెన్ మస్క్ ఇండియా వస్తాడా?

Kalki 2898 AD
Kalki 2898 AD
కల్కి సినిమాలో ప్రభాస్ నడిపే వెహికల్ బుజ్జిని ఇటీవల గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసి లాంచ్ చేసారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మహేంద్ర కంపెనీతో కలిసి కల్కి మూవీ టీమ్ ఈ బుజ్జి వెహికల్‌ని తయారుచేసింది. సరికొత్తగా ఉన్న ఈ వెహికల్‌ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. 
 
ఇక కల్కి సినిమాలో నటించిన వాళ్ళతో కాకుండా ఈ బుజ్జి వెహికల్‌తో సినిమా ప్రమోషన్స్ చేయడం గమనార్హం. ఇప్పటికే ఈ వెహికల్‌ని దేశంలోని పలు నగరాల్లో తిప్పుతూ ప్రమోషన్స్ చేస్తున్నారు. 
 
తాజాగా సినిమాకు, ఈ వెహికల్‌కి మరింత హైప్ తీసుకురావడానికి కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎలాన్ మస్క్‌కి ట్వీట్ చేసాడు. నాగ్ అశ్విన్ ఎలాన్ మస్క్‌ని ట్యాగ్ చేస్తూ తన ట్వీట్‌లో.. ప్రియమైన ఎలాన్ మస్క్ సర్.. మా బుజ్జిని చూడటానికి, నడపడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇది 6 టన్నుల బరువున్న ఒక వాహనం. 
 
ఫుల్ ఎలెక్ట్రిక్ వెహికల్, ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం. ఇది మీకు ఒక గొప్ప అనుభూతి ఇస్తుందని చెప్పగలను అని ట్వీట్ చేసారు. మరి ఎలాన్ మస్క్ నాగ్ అశ్విన్ ట్వీట్‌కి స్పందించి బుజ్జిని డ్రైవ్ చేయడానికి ఇండియా వస్తాడా చూడాలి.