శుక్రవారం, 19 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 మే 2024 (10:57 IST)

రెమాల్ తుపాను.. తెలంగాణకు ఎల్లో అలెర్ట్.. బలమైన గాలులు

Rains
రెమాల్ తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఐఎండీ సోమవారం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. 
 
రెమాల్ తుపాను ప్రభావంతో తెలంగాణలో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారి తీవ్ర వాయుగుండంగా మారింది. తుపాను ఆదివారం సాగర్ ద్వీపం వద్ద తీరం దాటింది.
 
అయినా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, సూర్యాపేట, నల్గొండ, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.