బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 జూన్ 2024 (12:46 IST)

తిరుమల వెంకన్నను దర్శించుకున్న త్రివిక్రమ్.. పవన్ కోసమేనా? (Video)

Trivikram
Trivikram
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మాటల మాంత్రికుడు, త్రివిక్రమ్ దర్శించుకున్నారు. కాలిబాటన వెళ్లి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్నను దర్శించుకున్నారు. సోమవారం రాత్రి తన భార్య సౌజన్య, కుమారుడు రిషితో కలిసి కాలినడకన తిరుమల చేరుకున్నారు. 
 
రాత్రి తిరుమలలోనే బసచేసి మంగళవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. మిత్రుడు, పవన్ కల్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించాలనే మొక్కుతో త్రివిక్రమ్ కాలినడకన వెంకన్నను దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో తితిదే అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. 
 
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది  సంక్రాంతికి  గుంటూరు కారం సినిమాతో మన ముందుకు వచ్చారు త్రివిక్రమ్. మహేశ్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ అయ్యింది.