మంగళవారం, 18 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శనివారం, 15 జూన్ 2024 (12:53 IST)

మావయ్య కోసం.. కాలినడకన తిరుమలకు హీరో సాయి ధరమ్ తేజ్! (Video)

saidharamtej
తన మావయ్య, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోసం హీరో సాయి ధరమ్ తేజ్ పెద్ద సాహసమే చేశారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తన మావయ్య గెలిస్తే కాలినడకన తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నారు. ఆ ప్రకారంగానే ముగిసిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. దీంతో సాయి ధరమ్ తేజ్ కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. 
 
పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్న అల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్.. కోరిక తీరడంతో అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల కొండపైకి దర్శనానికి వెల్లారు. మార్గమధ్యంలో ఆయనను అనేక మంది అభిమానులు ఆయనను గుర్తించి ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.