మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 జూన్ 2024 (12:39 IST)

బాలకృష్ణ 64 జన్మదినం-అఖిలాండం దగ్గర 664 కొబ్బరికాయలు-5కేజీల కర్పూరం (video)

SridarVarma
SridarVarma
తిరుమలలో బాలకృష్ణ 64 జన్మదినం సందర్బంగా తిరుమలలోని అఖిలాండం దగ్గర 664 కొబ్బరికాయలు కొట్టి, 5 కిలోల కర్పూరం వెలిగించి పూజలు నిర్వహించారు. బాలయ్య సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని శ్రీవారిని టీటీడీ ఎక్స్పోర్ట్ మెంబర్ ఎన్టీఆర్ రాజు అండ్ ఫ్యామిలీ ప్రార్థించింది.
 
ఈ సందర్భంగా రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కుమారుడు బాలయ్య బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నందమూరి అభిమానిగా నాకు చాలా గౌరవం ఆయనపై వుంది.
 
నేడు నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మా కుటుంబం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నందమూరి బాలకృష్ణ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలి అని ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలి. 
Sridhar
Sridhar
 
ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరికీ సేవా కార్యక్రమాలు చేయాలని అని ఆయన ఏ పని చేసిన విజయవంతం కావాలి అని ఆ శ్రీవారిని కోరుకుంటున్నాను, ఆయన పుట్టినరోజు మాకు ఒక పండగ లాంటిది" అని చెప్పారు.